ఇండియా కూటమిలో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలైనా.. ప్రత్యర్థి పార్టీల్లా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుని రోడ్డెక్కుతున్నారు. ఈ వ్యవహారం అధికార పార్టీకి అస్త్రంగా అవకాశం ఇస్తున్నారు.
BJP MP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను ఏకం చేస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన యాత్రలో ముస్లింలు అందరూ పాల్గొంటున్నారని, దానికి సంబంధించిన వీడియో రుజువు తన వద్ద ఉందంటూ చెప్పారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చని ఆదేశాలను కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని అన్నారు.
రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన యాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని పీకే విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన భారత్ జోడో న్యాయ యాత్రలో
పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై ఆకస్మిక దాడి జరిగింది. ఇవాళ మధ్యాహ్నం బీహార్ నుంచి బెంగాల్లోని మాల్దాలోకి ప్రవేశిస్తుండగా రాహుల్ ప్రయాణిస్తున్న కారు అద్దంపై కొంత మంది రాళ్ల దాడి చేశారు.
బీహార్లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాం లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇద్దరి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఇటీవల సీఎం హిమంత మాట్లాడుతూ.. యాత్రలో రాహుల్ గాంధీ తన ‘బాడీ డబుల్’ ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఉపయోగించిన బాడీ డబుల్ పేరు, చిరునామాను త్వరలోనే పంచుకుంటానని శర్మ చెప్పారు.