Rahul Gandhi: 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ నేత, ఎంపీ కే మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచే పోటీ…
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar: ఇండియా కూటమికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్కి మిత్ర పక్షాలు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉండదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఎంపీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.
అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు కారణమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, రాహుల్ గాంధీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు,…
రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు…
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ అస్సాంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వసర్మ, రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అస్సాంలోని పవిత్ర బటద్రవా ధామ్ వెళ్లాలని రాహుల్ గాంధీ భావించినప్పటికీ.. భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు అస్సాం సీఎం దేశంలోనే అవినీతి సీఎం అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అస్సాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు యాత్రలో పాల్గొన్న తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ రాష్ట్రంలో నాగోన్లో రాహుల్ యాత్ర బస్సు ముందు బీజేపీ కార్యకర్తలు ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ‘‘మోడీ..మోడీ’’ అంటూ నినాదాలు చేశారు.