Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును…
కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్ అయ్యారు..
బీహార్లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు.
బీహార్లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.
బీహార్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్లచోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ.. రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరక్షన్ తర్వాత.. బీహార్ ఎన్నికలు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్లో చేరారు.