Rajasthan: జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై ర్యాగింగ్.. 300 గుంజీలు తీయించడంతో..!
- జూనియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై ర్యాగింగ్
- 300 గుంజీలు తీయించిన సీనియర్ల
- తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటిగా మారిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ర్యాంగింగ్ భూతం కారణంగా ఒక విద్యార్థి జీవితం ప్రమాదంలో పడింది.
ఇది కూడా చదవండి: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
Also Read
గత నెలలో రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లోని ఒక మెడికల్ కాలేజీలో కొంతమంది సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి నాలుగు సార్లు డయాలసిస్ చేయవలసి వచ్చింది. సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. జూనియర్‌ను 300 కంటే ఎక్కువగా గుంజీలు తీయించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అంతేకాకుండా అతని కిడ్నీపై తీవ్ర ప్రభావం పడింది.
ఇది కూడా చదవండి: Kenya: మిలటరీ ఆధీనంలో కెన్యా.. 13కు చేరిన మృతుల సంఖ్య
సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుంజీలు కారణంగా విద్యార్థి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురైందని పోలీసులు తెలిపారు. బాధితుడు వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ వారంలోనే నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాలేజీకి కూడా వెళ్తున్నట్లు వెల్లడించారు. ఏడుగురు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాధితుడు గతంలోనే ర్యాగింగ్ ఎదుర్కొన్న ఫిర్యాదు చేయలేదని.. తాజా ఘటనతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఏడుగురు విద్యార్థులపై IPC సెక్షన్లు 323, 143, 147 (అల్లర్లు), 149 (సాధారణ వస్తువును ప్రాసిక్యూట్ చేయడంలో నేరం), 341 (తప్పు నిర్బంధం), 352 (దాడి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!