Chandrababu: గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని వేధింపులతో ఆయన అనుచరుడే ఆత్మహత్య చేసుకున్నాడు.. గుడ్లవల్లేరులో మట్టికి రెక్కలొచ్చాయి.. గుడివాడకు ప్రధాన సమస్య ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి.. కొడాలి నాని..! పిచ్చ పిచ్చ ఆటలొద్దు.. నోరు పారేసుకోవద్దు అని ఆయన చెప్పారు. వెనిగండ్ల రామును అభ్యర్థిగా పెడదామంటే.. రావి వెంకటేశ్వరరావు ఒప్పుకున్నారు.. రాము-రావి ఇద్దరూ కలిసి కొడాలి నానిని ఓడిస్తారు.. కొడాలి నానిని చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిపేసేలా ఓడించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read Also: Traffic Restrictions: వాహనదారులకు హెచ్చరిక.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి.. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు అని చంద్రబాబు అన్నారు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం.. తన పనైపోయిందని పేర్ని నాని తన సుపుత్రుడిని దించారు.. జోగి రమేష్ పెడనలో చెత్త.. ఇప్పుడు ఆ చెత్తను పెనమలూరుకు వేశారు.. పెడనలో జోగి చిటీ చిరిగింది.. గన్నవరం ఎమ్మెల్యే పేరు చెప్పను అని ఆయన అన్నారు. అతను నా స్థాయే కాదు.. గన్నవరం ఎమ్మెల్యే గంజాయి మొక్కని తెలీదు.. నేనే పెంచి పోషించా.. కైలే అనిల్.. అభివృద్ధి సున్నా.. అవినీతి మిన్న.. అవనిగడ్డ ఎమ్మెల్యే మురికి కాల్వ మరమ్మత్తు పనుల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు అని చంద్రబాబు ఆరోపణలు చేశారు.