Raa Kadali Ra: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు.. సైకిల్ – గాజు గ్లాసు తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించిన విషయం విదితమే.. ఈ రోజు పంచాయితీల సమస్యలపైసర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తారు.. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది.. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు..
Read Also: BRS: ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు
ఇక, ఈ రోజు జగరనున్న పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు.. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుండగా.. వివిధ రాజకీయ పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొంటారు.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల నిధులు, అధికారాలను దొంగిలించి 3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోందనే అంశంపై చర్చించనున్నారు.. రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేయనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు.. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పర్యటనలు.. నేటి నుంచి తిరిగి ప్రారంభంకానుంది.. నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటనలు సాగనున్నాయి.. ఇవాళ విజయనగరం, రేపు శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది.. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి.