Qatar frees 8 Navy veterans: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ…
ఇజ్రాయెల్-హమాస్‌ల (israel hamas) మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.
ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ఖతార్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు.. అంతకుముందు కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల రాకెట్ల ద్వారా ఇజ్రాయిల్‌పై దాడి చేయడమే కాకుండా, ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1200 మందిని ఊచకోత కోశారు. 240 మందిని అపహరించి గాజాలోకి బందీలుగా తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13,300 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలా మంది చిన్నారులు ఉండటంతో…
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
Qatar: ఖతార్ దేశంలో 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసి, ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ఉరిశిక్ష విధించడంపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఖతార్ లోని సాయుధ బలగాలకు శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించే దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ సంస్థ యజమానిని అరెస్ట్ చేసిందా,
Qatar: ఖతార్‌లోని అక్కడి కోర్టు 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులకు కావాల్సిన న్యాయసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కోర్టు తీర్పు గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.