మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి తన నివాసంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను చిరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన పివి సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది” అంటూ పీవీ సింధుకు సెల్యూట్ చేశారు. పివి సింధును చిరంజీవి, రామ్ చరణ్ 2021 ఆగష్టు 20న వారి నివాసంలో సన్మానించారు. ఆమె కోసమే ప్రత్యేకంగా నిర్వహించిన ఈ పార్టీకి చాలామంది సినీ సెలెబ్రిటీలు విచ్చేశారు.
Rea Also : ‘మనీ హెయిస్ట్’ ఫైనల్ సీజన్: సెలవు ప్రకటించిన ఐటీ
ఆరోజు చిరు విశాలమైన భవనం అందమైన లైట్లతో వెలిగిపోయింది. పివి సింధుకు మెగాస్టార్, చరణ్, సురేఖ, సుబ్బరామిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ వీడియోలో శ్రీజ కళ్యాణ్, ఉపాసన, సుహాసిని, రాధికలు కూడా కన్పిస్తున్నారు. నాగార్జున అద్భుతమైన అవుట్ ఫిట్ లో దర్శనం ఇచ్చారు. ఆయన ఈ పార్టీలో చాలా సంతోషంగా కన్పించారు. అఖిల్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అజారుద్దీన్ ఇతరులు సింధు, ఆమె సాధించిన పతకాలతో ఫోటోలు తీసుకున్నారు. చిరు సింధును శాలువతో సత్కరించారు. తరువాత చిరు మరోసారి పతకాన్ని అందించారు.
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)