ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్ లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) టీ20 క్రికెట్ టోర్నీక మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్దమయ్యాయి.
మా నాన్నకు నా పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. దీంతో ఆయన వచ్చి నన్ను తీవ్రంగా కొట్టాడు.. కాబట్టి మా నాన్నతో కలిసి వెళ్లి హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నాను.. అది నెగిటివ్ గా వచ్చింది అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు.