టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్- 2023 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్ కు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ టీమ్ తో కలిసిన గబ్బర్.. తమ హోం గ్రౌండ్ మొహలీల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 1న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.
Also Read : Chatrapathi: ప్రభాస్ ని గుర్తు చేసిన బెల్లంకొండ హీరో… నార్త్ లో హిట్ పడినట్లే
ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన 15 ఏళ్ల వయస్సులో టాటూ కారణంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నట్లు గబ్బర్ తెలిపాడు. తాను 15 సంవత్సర వయస్సలో కుటుంబంతో కలిసి మనాలి టూర్ కు వెళ్లాను.. అయితే మా కుటుంబ సభ్యులకు తెలియకుండా నేను నా భూజం మీద టాటూ వేయించుకున్నాను.. అది కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలల వరకు దాచి ఉంచాను అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
Also Read : WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
అయితే ఒక రోజు మా నాన్నకు నా పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. దీంతో ఆయన వచ్చి నన్ను తీవ్రంగా కొట్టాడు.. టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా కొంచెం భయపడ్డాను.. ఎందుకంటే టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదీతో వేశాడో నాకు తెలియదు.. కాబట్టి మా నాన్నతో కలిసి వెళ్లి హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నాను.. అది నెగిటివ్ గా వచ్చింది అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.