ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు.
Also Read : Love Fraud: నన్ను మోసాడు.. రోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్
కాగా గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబైపై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్ యాదవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : Taliban : తాలిబన్ల అదుపులో ముగ్గురు బ్రిటన్ జాతీయులు
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 191 పరుగులు చేయగా ఈ లక్ష్యచేధనలో కేకేఆర్.. 16 ఓవర్లు ముగిసేటప్పటికీ 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 29 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. అయిన వెంకటేశ్ అయ్యర్ ( 28 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2సిక్సులు), కెప్టెన్ నితీశ్ రాణా, (17 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకునే ప్రయత్నం చేశారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ తో కలిసి నాలుగో వికెట్ కు రానా 46 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పోరు. సికందర్ రజ వేసిన ఆరో ఓవర్లో వెంటేశ్ రెండు ఫోర్లు కొట్టాడు. భానుక రాజపక్స స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిషి ధావన్ వేసిన 9వ ఓవర్లో నితీశ్ రాణా 4,6,4 బాదాడు, కానీ రజ వేసిన పదో ఓవర్ లో రెండో బంతికి రాహుల్ చహర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read : Drugs Seized: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..
ఇక రాహుల్ చహర్ 11వ ఓవర్లో తొలి బంతికి రింకూ సింగ్ ను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్ ముగిసేటప్పటికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రింకూ సింగ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆండ్రూ రసెల్ ( 19 బంతుల్లో 35,3 ఫోర్లు, 2 సిక్సర్ల) తో కలిసి వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ ను విజయం వైపు నడిపంచాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 30 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. నాథన్ ఎల్లీస్ వేసిన 14వ ఓవర్ లో రసెల్ ఓ ఫరో కొట్టగా అయ్యర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాల్సి ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు.