Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Blow To Punjab Kings As Johnny Bairstow Ruled Out From IPL 2023: ఐపీఎల్-2023 సీజన్ సమీపిస్తున్న వేళ.. ఆయా జట్లకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల వల్లనో, లేక మరే ఇతర కారణాలతోనే.. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకి కూడా ఒక పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. గాయం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు.. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే.. ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ సమయానికి మరింత ఫిట్‌గా తయారయ్యేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 16వ సీజన్‌కి దూరం కావాలని అతడు డిసైడ్ అయ్యాడని తెలిసింది.
Padma Awards 2023: ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం.. అవార్డులు అందజేసిన రాష్ట్రపతి
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘‘ఈ ఏడాదిలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం జానీ బెయిర్‌స్టో యార్క్‌షైర్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయనున్నాడు. ఆ సిరీస్ కోసం మరింత ఫిట్‌గా ఉండేందుకు కసరత్తు చేస్తున్నాడు. దాంతో.. అతడు ఐపీఎల్-2023కు దూరం కానున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీకు అతడు తెలియజేశాడు’’ అంటూ ‘ది గార్డియన్’ తన నివేదికలో పేర్కొంది. ఇది పంజాబ్ కింగ్స్‌కి నిజంగా గట్టి దెబ్బేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఓపెనర్‌గా బరిలోకి దిగే జానీ, క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే తాండవం చేస్తాడు. పరుగుల వర్షం కురిపిస్తాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మాత్రం.. అతడి విధ్వంసాన్ని ఆపడం ఎవరివల్లా కాదు. అలాంటి ఆటగాడు దూరమైతే, పంజాబ్ కింగ్స్‌కి చాలా నష్టమే కదా! కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 39 మ్యాచ్‌లాడిన జానీ బెయిర్‌స్టో, 142.65 స్ట్రైక్‌రేట్‌తో 1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!