ఐపీఎల్ 2023 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఆస్ట్రేలియాకి చెందిన మాథ్యూ షార్ట్ ని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకుంది. గత ఏడాది గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఏర్పడిన గాయం నుంచి ఇంగ్లండ్ బ్యాటర్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం పంజాబ్ కింగ్స్ (PBKS) జానీ బెయిర్‌స్టో సేవలకు బ్రేక్ ఇచ్చింది. గత ఆగస్టులో దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ బెయిర్‌స్టో పాల్గొనలేదు.
Also Read:Jio True 5G: 5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..
గాయం కారణంగా జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2023కి దూరమయ్యాడని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది.”ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాం. అతనికి ఆల్ ది బెస్ట్.. నెక్ట్స్ సీజన్‌లో ఆడతాడని ఆశిస్తున్నాం. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఐపీఎల్ 2023కి మాథ్యూ షార్ట్‌ని తీసుకున్నాం’’ అని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ పేర్కొంది. గాయపడిన బెయిర్‌స్టో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ షార్ట్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ ఆటగాడిగా నిలిచిన మాథ్యూ షార్ట్ ఈ IPL 2023 కోసం తమతో చేరబోతున్నట్లు వెల్లడించింది.
Also Read:Kadiyam Srihari : బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. కడియం హాట్ కామెంట్స్
కాగా, కుడిచేతి వాటం గల షార్ట్ బిగ్ బాష్ లీగ్ (BBL) 2022-23 ఎడిషన్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడాడు. షార్ట్ T20 టోర్నమెంట్‌లో 14 మ్యాచ్‌లలో 35.23 యావరేజ్‌తో 458 పరుగులు చేశారు. 144.47 స్ట్రైక్-రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక, బెయిర్‌స్టో విషయానికి వస్తే, అతను ఫిబ్రవరిలో తిరిగి శిక్షణకు వచ్చాడు. అతను IPLలో భాగం కానప్పటికీ, మేలో ఆడబోయే కౌంటీ ఛాంపియన్‌షిప్ యొక్క డివిజన్ 2లో పాల్గొంటాడని భావిస్తున్నారు.
🚨 IMPORTANT UPDATE 🚨
We regret to inform you that Jonny Bairstow will not be a part of the IPL this season because of his injury. We wish him the best and look forward to seeing him next season.
We are pleased to welcome Matthew Short as his replacement.
#PunjabKings pic.twitter.com/NnUMjCe8jV
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2023