Rajasthan Royals Won The Toss And Chose To Bowl: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 8వ మ్యాచ్ జరుగుతుంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఆల్రెడీ చెరో విజయాన్ని సాధించారు. అయితే.. రన్ రేట్ పరంగా రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, పంజాబ్ మాత్రం ఐదో స్థానంలో ఉంది.
Vontimitta Kodanda Rama Swamy Kalyanam: ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం లైవ్
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. బహుశా ఈ రెండు జట్లకి ముంబై, చెన్నై జట్ల తరహాలో భారీగా ఆదరణ ఉండకపోవచ్చేమో గానీ.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగానే సాగుతుంది. చివరి బంతి వరకూ.. నరాల తెగేలా వీరి మధ్య పోరు సాగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఈ ఇరు జట్ల మధ్య జరుగుతున్న తాజా మ్యాచ్ పట్ల క్రీడాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందా? లేదా? అని టీవీ, మొబైల్ ఫోన్లకు ఆడియెన్స్ అతుక్కుపోయారు.
Padma Awards 2023: ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న కీరవాణి
అసోంలోని గువహతి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈసారి ఈ ఇరుజట్లు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగానే ఉన్నాయి. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్లు, మ్యాచ్‌ని మలుపు తిప్పే బౌలర్లు.. ఈ ఇరు జట్లలో పుష్కలంగా ఉన్నారు. మరి.. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరు ఓటమిని చవిచూస్తారో చూడాలి.