ఆంధ్రప్రదేశ్‌లో ఓ తల్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. తమకు కున్న నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దదారు.. చేసేది వ్యవసాయమే.. కష్టపడి నలుగురిని చదివించారు.. ఇక, వారి కష్టాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఆ నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సగర్వంగా నిలిచారు.. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి..
చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో గజరాజులు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. సోమల(మం)కొత్తూరు వద్ద రైతు పై ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో పొలం పనులు చేస్తున్నరైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు.. రైతు రామకృష్ణ రాజు చనిపోయిన ఆ మృతదేహం వద్ద సూమారు 16 ఏనుగులు గుంపు తిష్ట వేసుకుని ఉన్నాయి. గత మూడురోజుల నుంచి తిష్ట వేసిన ఏనుగుల గుంపు ఈరోజు రైతుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. Also Read:China…
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని, రీ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొరపాట్లు జరిగాయని రామారావు పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి గాలి ముద్దుకృష్ణమ నాయడును రాజీనామా చేయించారని, ఇప్పుడు నీ కొడుకు (నారా లోకేష్)ను రాజీనామా చేయమని చెబుతారా?…
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఒక అపశృతితో వార్తల్లో నిలిచింది. ఈ ప్రముఖ జాతరలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన సమయంలో, టీడీపీ నాయకుడు ఆర్వీటి బాబు, సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా ఆలయం పై పూలు చల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రయత్నం భక్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా, ఒక పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించింది. జాతర సందర్భంగా…
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు…
పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. "సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు..
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని అన్నారు. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.. అప్పుడు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో.. అతనిపై పగ పెంచుకుని ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా చిన్నారిని…
తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.