తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి.. జనగణన ఇంకా అవ్వలేదు.. జనగణన అయిన తర్వాతే నియోజకవర్గాల విభజన జరుగుతుందన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.. అయితే, ఒకవేళ పుంగనూరును రెండు నియోజకవర్గాలుగా చేస్తే ఒక నియోజకవర్గం నుండి నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Y+ Category to Ramachandra Yadav: ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది… 2022 డిసెంబర్ 4వ తేదీన వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు.. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…
చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే.. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ.. పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.. దీంతో పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు…