మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం అదృశ్యమైంది. గత నాలుగు రోజులుగా ఆమె కుటుంబం కనిపించడం లేదు. మహారాష్ట్ర అంతటా పోలీసులు గాలిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఫ్యామిలీని మళ్లీ కొత్త కేసులు వెంటాడుతున్నాయి. గతేడాదంతా పూజా ఖేద్కర్ను కేసులు వెంటాడాయి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ ఇరాకటంలో పడింది.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
Astrologer: పూణేలో 25 ఏళ్ల మహిళను ఓ జ్యోతిష్యుడు లైంగికంగా వేధించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ధంకావడి ప్రాంతంలో నిందితుడు అఖిలేష్ అక్ష్మణ్ రాజ్గురు(45) ఆఫీసులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థిని అయిన బాధితురాలు తన సోదరుడి జ్యోతిష్యం చార్జును రాజ్గురు వద్దకు తీసుకెళ్లింది. అతను జాతకాన్ని పరిశీలించి, మరుసటి రోజు ఒక వస్తువు ఇవ్వాల్సి ఉంటుందని బాధిత మహిళకు చెప్పాడు. Read Also: Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు…
రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. కొన్ని తెలిసి జరుగుతుంటాయి. ఇంకొన్ని అనుకోని విధంగా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్కిడ్ అయి బండ్లు పడిపోతుంటాయి. కానీ ఒకే చోట ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం అది వాహనదారుల తప్పు కాదు.
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట అబల దారుణానికి గురవుతూనే ఉంటోంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు.
Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో వచ్చిన ఈ అకాల వర్షం చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు నిలిచిపోయాయి. పూణేలో కొన్ని వివాహాల్లో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఈ కుండపోత వర్షం కారణంగా ఒక సానుకూల విషయం జరిగింది. వనవాడిలో జరిగిన ఒక వివాహ వేడుక మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించింది. వర్షం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వేరే మతానికి…
పూణె-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేడ్ శివపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.