మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం అదృశ్యమైంది. గత నాలుగు రోజులుగా ఆమె కుటుంబం కనిపించడం లేదు. మహారాష్ట్ర అంతటా పోలీసులు గాలిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
గత శనివారం నవీ ముంబైలో పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్‌కు చెందిన రూ.2కోట్ల ఖరీదైన కారును ఓ ట్రక్కు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. అనంతరం ట్రక్కు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్‌ను దిలీప్ ఖేద్కర్, అతని సహాయకుడు కిడ్నాప్ చేసి పూణె తీసుకెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా కారు పూణెలోని పూజా ఖేద్కర్ ఇంట్లో కనిపెట్టారు. ఇక ట్రక్కు డ్రైవర్ విడుదల చేయమని అడిగితే పోలీసులపైకి తల్లి మనోరమ రెండు కుక్కలను వదిలిపెట్టింది. అనంతరం పోలీసులు గోడ దూకి వెళ్లి డ్రైవర్‌ను రక్షించారు.
ఇది కూడా చదవండి: Giorgia meloni-Modi: మీ బలం.. సంకల్పం స్ఫూర్తిదాయకం.. మోడీకి ఇటలీ ప్రధాని స్పెషల్ గ్రీటింగ్
అయితే పోలీస్ స్టేషన్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తామే పోలీస్ స్టేషన్‌కు వస్తామని పోలీసులను పంపేశారు. కానీ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌కు రాలేదు. దీంతో ఇంటికెళ్లి చూస్తే.. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. దీంతో ప్యామిలీ అంతా పరారీలో ఉన్నట్లు గుర్తించి.. మహారాష్ట్ర అంతటా గాలింపు చేపట్టారు. దాదాపు ఇప్పటి వరకు నాలుగు రోజులైంది. అయినా కూడా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. కుటుంబ ఆర్థిక లావాదేవీలు, ఏటిఎం ఉపసంహరణలు, టోల్ బూత్ రికార్డులు, రైల్వే స్టేషన్లలో కదలికలను ట్రాక్ చేస్తున్నారు. అలాగే పూణెలోని ఫామ్‌హౌస్‌పై కూడా నిఘాలో ఉంచారు. దేశం విడిచి పారిపోకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.