Delhi Car Blast: ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక విషయం తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న మహిళా డాక్టర్ షాహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
Masood Azhar: సోమవారం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబ్ దాడితో దేశం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ పేరు వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకొట కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యాందాయ్ i20లో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనకు పుల్వామా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మధ్య సంబంధాలు బయటపడినట్లు…
Operation Sindoor: పాకిస్తాన్‌కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
2025 ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది భారతీయుల అమరవీరులను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం, నీరు ఎలా కలిసి ప్రవహిస్తాయని ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ అంశంపై దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.…
ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED)…
India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయి. ఫిబ్రవరి 14, 2019న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు్ను ఢీకొట్టాడు.