Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pahalgam Terror Attack: అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్న భారత్.. విదేశీ దౌత్యవేత్తలకు వివరాలు..
2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి, పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల హత్యలను ‘‘ప్రభుత్వ కుట్ర’’ అని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం బుధవారం కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అస్సాం పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ‘‘ఢింగ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం బహిరంగంగా తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే ప్రకటన ఆధారంగా నాగాన్ పోలీస్ స్టేషన్‌లో 347/25 పై 152/196/197(1)/113(3)/352/353 BNS కింద నేరాలు నమోదు చేయబడ్డాయి. దాని ప్రకారం అతన్ని అరెస్టు చేశాము. ’’ అని అస్సాం పోలీసులు ట్వీట్ చేశారు.
“ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమర్థించడానికి ప్రయత్నిస్తున్న ఎవరిపైనైనా మేము చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ప్రకటన వైరల్ అయింది. అతను పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు తేలింది, కాబట్టి మేము కేసు నమోదు చేసాము” అని సీఎం హిమంత బిశ్వ సర్మ చెప్పారు. అయితే, AIUDF చీఫ్ మౌలానా బదరుద్దీన్ అజ్మల్ ఇది తమ పార్టీ ప్రకటన కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఉగ్రవాదానికి మతం లేదని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు ఇస్లాంకి వ్యతిరేకులు అని అన్నారు.