Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.
Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు బిలాల్ అహ్మద్ కుచేయ్ గుండెపోటుతో మృతి చెందాడు. 32 ఏళ్ల బిలాల్ జమ్మూకశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలోని 18 మంది నిందితుల్లో బిలాల్ ఒకడు. బిలాల్ అహ్మద్ కుచేయ్.. జమ్మూకశ్మీర్ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందినవాడు. పుల్వామా సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంబంధించిన కేసులో బిలాల్ ప్రస్తుతం జైల్లు శిక్ష…
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
Pulwama attack: పుల్వామా దాడిపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పుల్వామా ఘటన కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఆంటోఆంటోనీ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 42 మంది జవాన్ల ప్రాణాలనున బలిగొందని ఆయన విలేకరులు సమావేశంలో అన్నారు. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని చెప్పడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపింది. ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోకుండా, జవాన్లను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మార్గం ద్వారా…
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్ (ఎక్స్)లో ప్రధాని మోడీ తెలిపారు.
Abhinandan Vardhaman: పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌పై ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్, ఇతర ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన విమానాలు భారత్‌పై దాడి చేసేందుకు రాగా..
Ayodhya Ram Mandir: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామమందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కర్ణాటక మంత్రి డీ సుధాకర్ అన్నారు.
2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు.