తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలకు సిద్దమవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించేందుకు ఇల్లందుకుంట మండలం సిరిసేడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది.
ఈ ఘటనలోనే ఓ టీఆర్‌ఎస్ కార్యకర్తల ఎస్సై కాలర్ పట్టుకున్నాడు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. అనుమతి తీసుకొనే ప్రచారం నిర్వహిస్తున్న మాపై ఈ విధంగా ప్రవర్తిస్తుంటే.. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ తీరుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.