బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై దేశం ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా బీజేపీ తీరును పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇదిలా ఉంటే ఖతార్, యూఏఈ, లెబనాన్, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి పలు ముస్లిం దేశాలు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన వ్యక్తం చేశాయి. వ్యక్తిగతంగా కొంతమంది చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.
కాగా.. ఈ రోజు శుక్రవారం ప్రార్థన కాగానే దేశ వ్యాప్తంగా పలు మసీదుల్లో ముస్లింలు నిరసన తెలిపారు. హైదరాబాద్ మక్కా మసీదులో ప్రార్థన తరువాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాటు ఢిల్లీలోని జామా మసీదులో కూడా ఇలాగే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపుగా 300 మంది ప్రార్థనలు ముగిసిన తరువాత రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. జామా మసీద్ షాహీ ఇమామ్.. తాము ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని.. వారంతా ఎంఐఎం, అసదుద్దీన్ మనునుషులు కావచ్చని అభిప్రాయపడ్డారు. నిరసన తెలిపితే తెలపవచ్చు కానీ మేమే వీటికి మద్దతు ఇవ్వమని ఇమామ్ అన్నారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ షహరాన్ పూర్ లో కూడా ఉద్రిక్తత తలెత్తింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ముస్లింలు నిరసన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్ పట్టణాల్లో పోలీసులు టైట్ సెక్యురిటీని పెట్టారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై కాన్పూర్ లో ఇటీవల ఘర్షణలు తెలెత్తాయి. కాన్పూర్ లో జరిగిన రాళ్లదాడిలో 40 మంది వరకు గాయపడ్డారు.
నుపుర్ శర్శ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల అనంతరం పలు ఉగ్రవాద సంస్థల నుంచి నుపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రతను పెంచారు.