ఇటీవల తెలంగాణలో జరుతున్న వరస అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహిళా కాంగ్రెస్ నేతలు మౌనదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ అత్యాచార ఘనటలో బాధితురాలని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు.
దేశంలో, తెలంగాణలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆమె విమర్శించారు. ప్రతీ రోజు తెలంగాణలో ఆరు ఆత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాధితురాలి వీడియోని బహిర్గత పరచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిసౌజా. టీఆర్ఎస్ పార్టీ అత్యాచారాలను సపోర్ట్ చేస్తుందని విమర్శించారు. ఈ రోజు పేపర్ లో ఐదు అత్యాచార ఘటనలకు సంబంధించిన వార్తలు ఉన్నాయని ఆమె అన్నారు.
జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడు కూడా ఉన్నాడని డిసౌజా ఆరోపించారు. నిన్నటి వరకు మా అధ్యక్షురాలు డీజీపీ మహేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆమె అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిసౌజా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. కేసుల్లో రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అవుతున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ పాలిటిక్స్ లో గుండాాగిరి నడుస్తోందని..తెలంగాణలో మద్యం, డ్రగ్స్, పబ్ కల్చర్ ఎక్కువైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బాధితురాలికి అండగా నిలబడుతుందని డిసౌజా అన్నారు.