InnoHub Technologies: బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి చివరకు వారిని నట్టేట ముంచాయి. తాజాగా ఆ లిస్టులోకి మరో కంపెనీ యాడ్ అయ్యింది. మాదాపూర్ లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ పేరిట ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ అవుతుంది. ఉద్యోగం లేనివారికి మంచి అవకాశమని, రెండు లక్షలు కడితే జీవితం సెట్ అవుతుందని నిరుద్యోగులను నమ్మించారు.
ఇక వారు కూడా మంచి కంపెనీ అని నమ్మి రెండు లక్షలు కట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కంపెనీ రెండు నెలలు వారికి ఎటువంటి అనుమానము రాకుండా జీతాలు ఇచ్చింది. ఇక రెండు వారాల క్రితం ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ తమ అధికారిక వెబ్సైట్, మెయిల్స్ ను బ్లాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఉద్యోగులు వెంటనే ఏమైందో అని ఆరాతీశారు. అయితే అప్పటికే కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని చెక్కేయడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 800 మంది ఉద్యోగులు నడిరోడ్డుపై పడ్డారు. సంస్థపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని సోమవారం వారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఈ విషయం బట్టబయలు అయ్యింది.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!