Amit Shah: అగ్నిపథ్ స్కీమ్ పై స్పందన.. ఆందోళనలపై కిషన్ రెడ్డితో మాట్లాడిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్నబీహార్ లో మొదలైన ఆందోళనలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు రోడ్డెక్కారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను టార్గెట్ చేస్తూ విధ్వంసం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 200పైగా ట్రైన్స్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రైళ్లకు మంటపెట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, క్రీడలు, యువజన శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశానికి, యువతకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ మరింత బలోపేతం అవుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా అగ్నిపథ్ స్కీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై స్పందించారు. గత రెండేళ్ళలో, కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలో నియామక ప్రక్రియ ప్రభావితమైందని..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపథ్ యోజన’లో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచారని అన్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచారని..దీని వల్ల యువత పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతుందని.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వారు దేశానికి సేవ చేసే దిశలో ముందుకు వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో చెలరేగిన హింసపై అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. హింసకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!