Tension at the Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నం.. లాఠీచార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపించారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూడడంతో VRA లు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇతర శాఖలో VRA లను భర్తీ చేస్తాం అని కేసీఆర్ ప్రకటించడంతో.. కేసీఆర్ స్టేట్మెంట్ తో సిటీ లో ఆందోళన వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి VRA లు వరుసగా పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసుల మెహరించడంతో.. ప్రగతి భవన్ నుంచి అసెంబ్లీ దారి పొడవు ఉన్న షప్స్ ని క్లోస్ చేస్తున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ముట్టడికి వస్తున్నా వందలాది మంది VRA లను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మల్లిస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడించిన కార్యకర్తలు. మత్స్యకారుల టెండర్లను ఆంధ్ర వారికి ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేశారు. తెలంగాణ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రికత్తత నెలకొంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉద్రిక్తతత చోటుచేసుకుంది. జీఓ 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. విద్యావాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులను వెంటనే నియమించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో అసెంబ్లీ కి పిలుపు నిచ్చారు.
వీఆర్‌ఏ, ఉపాధ్యాయులు, కాంగ్రెస్,లతో అసెంబ్లీ ప్రాంతం అంతా ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకోడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని నిరసనలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!