GHMC : రికార్డు సృష్టించిన ఆస్తిపన్ను వసూళ్లు.. ఆరు నెలల్లో రూ.1,000 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్‌ఎంసీ ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను రూ.1,000 కోట్లు వసూలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆస్తిపన్ను వసూళ్లు ఆరు నెలల్లోనే రూ.1,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి, ఇప్పటివరకు ఏ సంవత్సరంలో కూడా ఈ విధంగా ఆస్తిపన్ను వసూలు కాలేదు. జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 28 వరకు ఆస్తి పన్ను మొత్తంగా రూ.1,165.17 కోట్లు వసూలయ్యాయి. శేరిలింగంపల్లి సర్కిల్ రూ. 171.23 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, జూబ్లీహిల్స్ సర్కిల్ (రూ. 119.49 కోట్లు), ఖైరతాబాద్ సర్కిల్ (రూ.92కోట్లతో) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చాలా మంది ఆస్తి యజమానులు ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించగా, మరికొందరు మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించారు. పలువురు ఆస్తి యజమానుల నుంచి బిల్లు కలెక్టర్లు పన్ను వసూలు చేయడమే కాకుండా జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లను సందర్శించి చెల్లించిన వారు కూడా ఉన్నారు.
Also Read : Kaloji Health University : నేటి నుంచి ఎంబీబీఎస్ తొలి విడత ప్రవేశాలు
ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ 28 వరకు ఆర్జించిన రూ.1,165 కోట్ల ఆదాయంలో జూలైలో ప్రవేశపెట్టిన వన్-టైమ్ స్కీమ్ (OTS)తో, 47,205 అసెస్‌మెంట్ల ద్వారా రూ.92.78 కోట్లు వసూలు చేయబడ్డాయి. ఆస్తి పన్ను బకాయిలతో ఇబ్బంది పడుతున్న వారికి OTS ఉపశమనం అందించింది. ఈ పథకం అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై 90 శాతం పేరుకుపోయిన బకాయి వడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. కానీ, పన్ను చెల్లింపుదారు 2021-22 వరకు పన్ను బకాయిల అసలు మొత్తాన్ని, 10 శాతం సేకరించిన వడ్డీతో పాటు ఒకేసారి క్లియర్ చేయాలి. ఓటీఎస్ కింద వసూలు చేసే పన్నును మరింత పెంచే యోచనలో ఉంది జీహెచ్‌ఎంసీ. ఆదాయ పునరుత్పత్తి చర్యలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమీషనర్ అక్టోబర్ 30, అంటే ఆదివారం ఈ ఆదాయ సాధనకు సంబంధించిన వారికి పని దినంగా ఉండాలని ఆదేశించారు. “ఓటీఎస్ సోమవారం ముగుస్తుండడంతో బిల్ కలెక్టర్లు ఆదివారం సైతం ఇళ్లను సందర్శించి, బకాయి వడ్డీని క్లియర్ చేయించనున్నారు. కార్యకలాపాలను కార్పొరేషన్ సీనియర్ అధికారులు కూడా పర్యవేక్షిస్తారని జీహెచ్‌ఎంసీ అధికారి తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!