PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ.. పార్టీ ఆఫీస్‌ల ఆస్తి పన్ను కూడా కట్టలేని పరిస్థితి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.. అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లాంచాలని పేర్కొంది.. దీంతో.. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపు వివరాలను ఏఐసీసీ ట్రెజరర్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. దీనిపై స్పందించిన ఏఐసీసీ.. స్థానికంగానే నిధులు సమీకరించుకుని బకాయిలు చెల్లించుకోవాలని సమాధానం ఇచ్చింది.. దీంతో.. పార్టీలోని సీనియర్లను.. పార్టీ సానుభూతిపరులను విరాళాలు కోరుతూ లేఖ రాశారు గిడుగు రుద్రరాజు.. విరాళాలు అందించే వారు ఏ ఖాతాల్లో వేయాలో అనే బ్యాంకు వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.. మొత్తంగా విరాళాలు సేకరించి.. ఆస్తి పన్ను చెల్లించేందుకు పీసీసీ సిద్ధం అయ్యింది.
Read Also: Minister RK Roja: ప్రజలు జగనన్న వన్స్ మోర్ అంటున్నారు.. టీడీపీది పగటి కలే..!
Also Read
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ఏఐసీసీకి రాసిన లేఖలో వివిధ జిల్లాల కార్యాలయాలకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను పేర్కొన్నారు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నం రూ.30 లక్షలు, కాకినాడ రూ.42,71,277, ఏలూరు రూ.6,29,926, విజయవాడ రూ.41,73,917, గుంటూరు రూ.3,92,282, ఒంగోలు రూ.5,31,783, నెల్లూరు రూ.1,51,867, కడప రూ.6 లక్షలు, కర్నూలు రూ.2,94,890.. ఇలా మొత్తంగా రూ.1.40 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న వివరాలను లేఖలో పొందుపర్చారు.. ఇక, దానిపై అధిష్టానం స్పందించిన తర్వాత.. ఇప్పుడు ఫండ్ వసూలుకు పూనుకున్నారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. అసలే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.. కానీ, ఆ పార్టీని మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..