Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు వేశారు.
రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్, రాయబరేలి స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో.. ఏ స్థానంలో ఉండాలి.. ఏ స్థానాన్ని వదులేసుకోవాలనే దానిపై…
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతను ఏ స్థానాన్ని నిలబెట్టుకుంటారు..? ఏ స్థానాన్ని వదిలేస్తారనేది ఉత్కంఠగా మారింది.
Rahul Gandhi: తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి "ఎక్స్" లో సందడి నెలకొంది. 'నీట్ పేపర్ని రద్దు చేయండి' అనే హ్యాష్‌ట్యాగ్ "X" (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది.
భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.