Rahul Gandhi: రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు.. పూలవర్షంతో స్వాగతం పలికిన కార్యకర్తలు
- కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు
- కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పూలవర్షంతో స్వాగతం పలికిన కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Birthday: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం, 10 జనపథ్ చుట్టూ శుభాకాంక్షల హోర్డింగ్‌లు, బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. ఇంతలో పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కార్యకర్తలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రాయ్‌బరేలీ ఎంపీ అయిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ గొప్ప వేడుకలకు దూరంగా ఉండాలని, బదులుగా మానవతా ప్రయత్నాలు, దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
Read Also: Nalanda University campus: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్టును పెట్టింది. ప్రేమను ఎంచుకోవడం నేర్పిన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాహుల్ కు పార్టీ విషెస్ చెప్పింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “భారత రాజ్యాంగ విలువల పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత, కోట్ల మంది జీవితాల పట్ల మీ కరుణ మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నాను.” అని ఖర్గే రాహుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుత్‌గై కూడా రాహుల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ఓ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే, డియర్ బ్రదర్ రాహుల్ గాంధీ! దేశ ప్రజల పట్ల మీ అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీకు ఈ సంవత్సరం నిరంతరం పురోగమిస్తూ, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని స్టాలిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..”మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు నేను కోట్లాది మంది భారతీయులతో కలిసి ఉన్నాను!” అని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేసారు. అన్ని అసమానతలతో పోరాడటం రాహుల్ వ్యక్తిత్వమని అన్నారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడాలన్నది ఆయన దృక్పథం. త్యాగం వారసత్వం, పోరాటమే ఆయన తత్వశాస్త్రం. ఆయన చిత్తశుద్ధి, రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!