Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కోడలు అవివా బేగ్ ప్రత్యక్షం.. వీడియో వైరల్
- ప్రియాంకాగాంధీ ర్యాలీలో కోడలు అవివా బేగ్ ప్రత్యక్షం
- రైహాన్ వాద్రాతో కలిసి ర్యాలీలో కనిపించిన స్నేహితురాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రైహాన్ వాద్రా ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. రైహాన్ వాద్రా-అవివా బేగ్‌కు నిశ్చితార్థం జరిగిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇదిలా ఉంటే తాజాగా అవివా బేగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది వయనాడ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలో కాబోయే కోడలు అవివా బేగ్ ప్రత్యక్షమయ్యారు. రైహాన్ వాద్రాతో కలిసి ర్యాలీలో పాల్గొంది. రైహాన్ వాద్రా పక్కన నిలబడిన అవివా బేగ్ చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించింది. నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీలో నివసించే అవివా బేగ్ మీడియా, డిజైన్, ఫొటోగ్రఫీలో నైపుణ్యం ఉంది. రైహాన్ వాద్రాకు అదే ఇష్టం. దీంతో ఇద్దరి ఇష్టాలు ఒకటి కావడంతో 7 ఏళ్ల నుంచి స్నేహం చేస్తున్నారు. ఇటీవల రైహాన్ వాద్రా.. పెళ్లి ప్రపోజ్ చేయగానే వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అవివా బేగ్ తల్లి నందితా బేగ్-ప్రియాంకాగాంధీ కూడా చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితురాళ్లుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్‌ను నిందితా బేగ్‌నే చేసినట్లుగా సమాచారం. ఇలా రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదే రైహాన్ వాద్రా-అవివా బేగ్ బంధానికి పునాదులు పడినట్లుగా తెలుస్తోంది.
రైహాన్ వాద్రా…
రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు (Visual Artist), వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులోనే కెమెరా చేతపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతగానో ప్రోత్సహించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. ఇక 2017లో పాఠశాల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రైహాన్ వాద్రా కంటికి గాయమైంది.
Raihan Vadra has always preferred to stay away from politics and live a normal and private life.
This video is from last year, where his mother Priyanka Gandhi Vadra was addressing people during Wayanad bypoll.
He stood there quietly like any ordinary person and remained beside… pic.twitter.com/8Je1IdGjjp
— Amock (@Politicx2029) December 30, 2025
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!