తన భార్య ప్రియాంకాగాంధీ ఏదొక రోజు భారతదేశ ప్రధాని అవుతుందని భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. ప్రియాంకాగాంధీ తన నాయనమ్మ లాగానే బలమైన ప్రధానమంత్రి అని నిరూపించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రాను మీడియా ప్రశ్నించగా.. భార్యకు మద్దతు ప్రకటించారు. ఇది కచ్చితమేనని.. ఏదొక రోజు ప్రియాంకాగాంధీ భారతదేశ ప్రధాని అవుతుందని.. ఇది అనివార్యం అని పేర్కొన్నారు.

చాలా మంది ప్రియాంకాగాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అది నేరవేరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్ ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన మార్పులు కాలక్రమేణా జరుగుతాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ వాద్రా అన్నారు.
ఇది కూడా చదవండి: Epstein Files: మరో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల.. ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
ప్రియాంకాగాందీ తన నాయనమ్మ (ఇందిరా గాంధీ), ఆమె తండ్రి (రాజీవ్ గాంధీ), తల్లి (సోనియాగాంధీ) సోదరుడు (రాహుల్ గాంధీ) నుంచి చాలా నేర్చుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు ఆమెను ఆరాధిస్తారని.. ఆమె ఎప్పుడు మాట్లాడినా హృదయంలోంచి మాట్లాడుతుందన్నారు. ఆమె ఏం మాట్లాడినా ప్రజలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్ దుర్మరణం