ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ డెవలప్మెంట్ జరగబోతుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టుని సిట్ ఆశ్రయించబోతుంది.. నాలుగు సార్లు ప్రభాకర్ రావు విచారించిన తమకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ చెప్పబోతుంది.. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ని వెంటనే రద్దుచేసి కస్టోడియల్ ఎంక్వయిరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంను సిట్ కోరే అవకాశం ఉంది.. ఇందుకు సంబంధించి పావులను సిట్ కరూపుతుంది.
గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్‌లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం…
CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని…