ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ డెవలప్మెంట్ జరగబోతుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టుని సిట్ ఆశ్రయించబోతుంది.. నాలుగు సార్లు ప్రభాకర్ రావు విచారించిన తమకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ చెప్పబోతుంది.. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ని వెంటనే రద్దుచేసి కస్టోడియల్ ఎంక్వయిరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంను సిట్ కోరే అవకాశం ఉంది.. ఇందుకు సంబంధించి పావులను సిట్ కరూపుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు నాలుగు సార్లు ప్రభాకర్ రావుని సిట్ విచారించింది.. విచారించిన ప్రతిసారి కూడా తనకు సమాచారం తెలియదని ఎక్కువ సార్లు చెప్పారు. అంతేకాకుండా చాలావరకు ఇది అధికారికమైన రహస్య సమాచారం.. అత్యంత గోప్యత కూడిన సమాచారం.. కొన్ని సందర్భాల్లో నా వ్యక్తిగతమైన సమాచారం.. అంటూ ప్రభాకర్ రావు తప్పించుకునే ప్రయత్నం చేశారని అధికారులు చెప్తున్నారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ఆదేశించింది.. ప్రభాకర్ రావు మాత్రం విచారణకు సహకరించడం లేదని అధికారులు అంటున్నారు..
READ MORE: Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మళ్లీ షాక్.. మరో కేసులో రిమాండ్..
ఈ నేపథ్యంలో అతనికున్న రిలీఫ్ ని రద్దు చేయాలని సుప్రీం ఆశించబోతుంది.. మరోవైపు ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. ఇప్పటికే రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న ఐపిఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ లను సిట్ విచారించింది.. దీంతోపాటు అప్పటి డిజిపి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అధికారులు అంటున్నారు.. రివ్యూ కమిటీకి ప్రభాకర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ అని నేరుగా డి వో టి కి పంపింగ్ కోసం లీగల్ గా అనుమతులు తీసుకున్నారు. ప్రభాకర్ ఇచ్చిన సెల్ ఫోన్ లను రివ్యూ కమిటీ పరిశీలించలేదని ఆరోపణలు ఉన్నాయి. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.