చదివేది 9వ తరగతి… ఈ అమ్మాయి టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగాండాలో ఓ తెలుగు అమ్మాయి చిన్నతనంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటోంది. చదివేది 9వ తరగతి అయినా ఉగాండా అధ్యక్షుడి చేత ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 14 ఏళ్ల వయసున్న తెలుగు అమ్మాయి గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఆ అమ్మాయికి వివిధ దేశాలు తిరగాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె ఆహార ప్రియురాలు. అటు క్రీడల్లోనూ ప్రజ్ఞశ్రీ ప్రతిభను చాటుతోంది. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఔట్ డోర్ గేమ్స్‌తో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లోనూ తన ప్రావీణ్యం చూపుతోంది.
Read Also: అక్క విడాకులు.. చెల్లెలు ప్రొఫైల్ పిక్ వైరల్
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
అయితే కొత్త విషయాలు నేర్చుకోవడంతో ప్రజ్ఞశ్రీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాండా జాతీయ గీతాన్ని వారి భాషలోనే నేర్చుకుని ఔరా అనిపించింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగమ్మాయి ఉగాండా జాతీయ గీతాన్ని పాడటంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రముగ్ధుడయ్యారు. దీంతో స్వయంగా ఆ అమ్మాయిని పిలిచి ఉగాండా దేశ అధ్యక్షుడు యోవరి కగుట ముసవెని అభినందనలు తెలియజేశారు.

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండా పర్యటనకు వెళ్లినప్పుడు స్వయంగా గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ పూలబొకే ఇచ్చి స్వాగతం పలకడం విశేషం. ఇంతటి టాలెంట్ గల అమ్మాయికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. ప్రజ్ఞశ్రీ నెమలి, మూడు కుక్కపిల్లలు, సింహం పిల్ల, తాబేలు, ఏనుగు వంటి వాటిని ముద్దుగా పెంచుకుంటోంది.

తాబేలుకు మధు అని, సింహం పిల్లకు శ్రీ అని, ఏనుగుకు నైకటో అని, కుక్క పిల్లలకు ఫ్లాష్, రోచర్, ఒరియో అని పేర్లు పెట్టుకుంది ప్రజ్ఞశ్రీ.


తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..