ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఏం రాశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని… వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని లేఖలో కేసీఆర్ ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇన్పుట్ కాస్ట్ రెట్టింపు అయినట్లు లేఖలో గుర్తుచేశారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్ప రైతులకు వచ్చిన ఆదాయమేమీ లేదని కేసీఆర్ అన్నారు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని దేశంలో కోట్లాది మంది రైతుల తరఫున కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ తెలిపారు. నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
- Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష

తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!