నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి తన నెక్సా ఫ్లాగ్‌షిప్ SUV – గ్రాండ్ విటారా SUV ప్రత్యేక ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ అని పిలువబడే ఈ మోడల్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్‌లో (గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్) లభ్యమవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ వెంటిలేటెడ్ సీట్లతో కూడిన మ్యాట్ బ్లాక్ కలర్, షాంపైన్ గోల్డ్ యాక్సెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 22.86 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిమోట్ యాక్సెస్, కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు, ఆరు ఎయిర్‌బ్యాగులు, ESP, EBD, ABS, హిల్ హోల్డ్ వంటి కళ్లు చెదిరే ఫీచర్లతో వస్తుంది.
Also Read:Lovers Murder: నది ఒడ్డున ప్రేమికుడు, కొండపై ప్రియురాలి మృతదేహాలు.. చంపిందెవరు..?
దీనిలో 1.5 లీటర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 116 bhp శక్తిని, 141 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది. దీనికి హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందించారు. దీనితో పాటు, దీనికి CVT ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు. కొత్త గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని నెక్సా డీలర్‌షిప్‌లలో ఓపెన్ అయ్యాయి. అయితే, ధరలు ఇంకా వెల్లడించలేదు.