రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పంజాబ్‌లో 99 శాతం ఓట్లు యశ్వంత్ సిన్హాకు వస్తున్నాయని పంజాబ్ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సోమవారం అన్నారు. ఓట్ల రద్దుకు దారితీసే ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశంలో చెప్పామన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉన్నా.. తన పర్యటనను రద్దుచేసుకున్నారామె.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఆమె చేరుకోవాల్సి ఉంది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సోమజిగూడలోని ఓ హోటల్‌లో మేధావులతో సమావేశం, ఆ…
రాష్ట్రపతి ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముర్ము తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మద్దతు సంపాదించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ లో నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట ప్రతిపక్షాల ప్రధాన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,…
తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు సీఎం నవీన్ పట్నాయక్
గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.. ఇవాళ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు విరించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.