కాబోయే భారత రాష్ట్రపతి ఎవరు? అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పోటీకి పెడుతుంది? ఎవరు బరిలోకి దిగబోతున్నారు? అనే చర్చ ఆసక్తికరంగా సాగింది.. ఈ సమయంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.. అయితే, అనూహ్యంగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసింది బీజేపీ.. ఇవాళ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు విరించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
Read Also: Twitter: ట్విట్టర్ బోర్డు కీలక తీర్మానం.. ఇక, ఆయన చేతికే..
జూనియర్ అసిస్టెంట్ నుంచి టీచర్ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ద్రౌపది.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఒడిశాలో ఒక పర్యాయం గిరిజన శాఖ మంత్రిగా కూడా ఆమె సేవలు అందించారు. ఇక, జార్ఖండ్ రాష్ట్ర తొలి గవర్నర్‌గా పనిచేశారు.. ఎక్కడా వివాదాల జోలికి ఆమె వెళ్లలేదని చెబుతారు.. 1997లో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్ జిల్లా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ముర్ము సరిగ్గా అదే సంవత్సరం రాయరంగ్‌పూర్ వైస్-ఛైర్‌పర్సన్ అయ్యారు. 2000 అసెంబ్లీ ఎన్నికలలో, ఆమె అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు మరియు 2002 వరకు రవాణా మరియు వాణిజ్య శాఖ మంత్రిగా చేశారు.
ఒడిశా ప్రభుత్వం ఆమెకు 2002లో ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖను అప్పగించింది.. ఆమె 2004 వరకు ఆ పదవిలో పనిచేశారు.. ముర్ము 2002 నుండి 2009 వరకు మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004లో, ఆమె రాయంగ్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఆమెను 2006లో ఒడిశా షెడ్యూల్డ్ తెగ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది.. 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె మళ్లీ 2010లో మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికైంది. 2013లో ఆమె మూడోసారి అదే జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలయ్యారు. ఆమె ఏప్రిల్ 2015 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆమెకు మే 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా.. భారత రాష్ట్రపతిగా ఆమె ఎన్నికకావడం లాంఛనంగా చెప్పుకోవచ్చు.. విపక్షాలు ఉమ్మడిగా ఓ అభ్యర్థిని పోటీకి పెట్టినా.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడం లాంఛనమే అనవచ్చు.