గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను సైతం ఇప్పుడు మార్చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు HRA ఖరారు పై ఇవాళ రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎస్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని చెబుతుందన్నారు. Read Also: డేంజర్ బెల్స్..…
ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షాకిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది ఏపీజీఈఏ. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది.…
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు,…