గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను సైతం ఇప్పుడు మార్చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు HRA ఖరారు పై ఇవాళ రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎస్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని చెబుతుందన్నారు.
Read Also: డేంజర్ బెల్స్.. తెలంగాణలో కొత్తగా 2,319 కరోనా కేసులు
ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తోన్న ఉద్యోగ సంఘాల నాయకులు. రేపు మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏపై క్లారిటీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయన్నారు. రేపు మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏపై క్లారిటీ రాకుంటే సమావేశం అయి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రేపు మధ్యాహ్నంలోగా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, రిటైర్మెంట్ ఉద్యోగులకు లభిస్తున్న అదనపు మొత్తంపై స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమానికి వెళ్తామని జేఏసీ ఐక్య వేదిక నాయకలు పేర్కొన్నారు.