ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఆయన కుటుంబం, ప్యానల్ తో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలోనే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తానని అన్నారు. ఇరు రాష్టాల సీఎం లను సినిమా ఇబ్బందిలపై కలుస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక ‘మా’లో జరుగుతున్న వివాదం గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిలదీస్తే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుంది.…
‘మా’ ఎన్నికల వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎన్నికల సమయంలో తమపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని ఆరోపిస్తూ ‘మా’ ఎన్నికలపై కోర్టుకు వెళ్తామని, అయితే అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తామని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్…
‘మా’ కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు, అతని ప్యానెల్ సోమవారం ఉదయం తిరుమలను సందర్శించి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. విఐపి దర్శనం సమయంలో విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన సోదరి లక్ష్మి మంచుతో పాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుతం వివాదాస్పదమైన సీసీటీవీ ఫుటేజ్ గురించి స్పందించారు. Read Also : “అలయ్ బలయ్”లో నేను, పవన్ మాట్లాడుకున్నాము : మంచు విష్ణు…
‘మా’లో వివాదం ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉంది. అందరినీ కలుపుకుపోతామని చెబుతూ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇటీవలే ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అందరూ భావిస్తున్నారు. నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో కూడా మంచు, విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోకపోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ఆ విషయంపై…
‘మా’ ఎలక్షన్లు ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరోవైపు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ‘మా’ ఎన్నికల సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా…
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో…
అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ మంచి మెజారిటీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఈరోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి, పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ ఫైల్ పై సంతకం చేశాడు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ నిన్న తమ పదవులకు రాజీనామా చేసారు. వారంతా ‘మా’లో సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే తాము గెలిచినప్పటికీ తమ పదవులను…
అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారంతా “మా” పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు రూట్ క్లియర్ అయినట్టుంది. రెండేళ్ల పాటు “మా”లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. “మా” సభ్యుల మంచికోసమే ఈ రాజీనామాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించింది. ఈ రెండేళ్లలో విష్ణు చేసే పనులుకు అడ్డుగా ఉండకూడదనే ఈ రాజీనామాలన్నారు. మీడియాను పిలిచి ఈ విషయం స్వయంగా చెప్పారు ప్రకాష్ రాజ్. మూకుమ్మడి…
నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడిన వారిపై కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు యాంకర్, నటి అనసూయ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్లు రాజీనామా ప్రకటన కోసం ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి వచ్చిన అనసూయ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో.. మా ఎన్నికలపై మీడియా ప్రశ్నించింది.. ఆ ప్రశ్నలపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఆమె.. నన్ను మీరు ఘెరావ్ చేసినంత పనిచేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే,…