‘మా’ ఎలక్షన్లు ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరోవైపు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ‘మా’ ఎన్నికల సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?
‘మా’ ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయన్న ప్రకాష్ రాజ్, తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని కోరారు. కానీ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించింది. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా ‘మా’ ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ వివాదంలో కొత్త కోణం చోటు చేసుకుంది. వివాదంలో కలగజేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ను సీజ్ చేశారు. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేయగా, ఆయన పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు పోలీసులు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.