గులియన్ బారే సిండ్రోమ్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. Also…
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ…
భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందంటున్నారు.. అయితే, ఈ ఘటనతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్.. వాళ్లు రాస్తున్న కథనాలు చూస్తుంటే.. ప్రభుత్వంలో ఎరున్నారు? అనే సందేహం కలుగుతుంది. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. ఆర్థిక…
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…
మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..