ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.. దర్శి నియోజకవర్గంలో ఏపీలో అత్యధికంగా 90.25 శాతం పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది అని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ కౌంటింగ్ రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున 28 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నాం.. ఒంగోలు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేకంగా 40 టేబుల్స్ ఏర్పాటు చేశాం.. కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో…
ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) విమర్శించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలోని ఉప్పలపాడులో గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ (సచివాలయం)పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నిర్వహించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.