బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముందుగా నిర్ణయించిన ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేశారు.. అయితే, ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పర్యటనను ఖరారు చేశారు.. దీంతో. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాగులప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించనున్నారు..
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు పోలీసులు..
Prakasam District: ప్రకాశం జిల్లా దేవనగరం ప్రాంతంలో చిరుత పులులు తిరుగుతున్నాయని, ఎన్నడు లేని విధంగా మనషులపై దాడులు చెయ్యడం, చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎలాగైన చిరుతపులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ధర్న నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను త్వరలో పట్టుకుంటాం అని హామి ఇవ్వడంతో అందోళన విరమించారు. అనుకున్నటు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఆపరేషన్ చెప్పటగా దాదాపు 6 గంటలు తరువాత గుంత నుంచి బయటకి…