సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడ్డారు. సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. అలల తీవ్రతను అంచనా వేయని వీళ్లు.. ఐదుగురు కెరటాలకు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందినవారిగా గుర్తించారు. కాగా.. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు మాధవ, జెస్సికా, యామినిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Tollywood: నెపో కిడ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా టాలీవుడ్ వెయిటింగ్!
పాకల బీచ్‌లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటన స్థలంలో మంత్రి పర్యవేక్షించారు. మృతదేహాలకు వెంటనే పోస్ట్‌మార్టం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీచ్ దగ్గరే ఉండి మరో మృతదేహం కోసం గాలింపు చర్యలను పర్యవేక్షించారు మంత్రి.. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఫోన్లో పరామర్శించారు. బీచ్‌లో నలుగురు మృతి చెందడం దురదృష్టకరం అని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కూడా బీచ్‌ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్వామి పేర్కొన్నారు.
Read Also: Obama: విడిపోతున్న ఒబామా దంపతులు..! విడాకులకు అఫ్లై చేసుకున్నట్లు వార్తలు!