అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
Electricity Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరగడంతో 16000 మెగావాట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 19 ఉదయం 7 గంటల 55 నిమిషాలకు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10వ తేదీన 15998 మెగావాట్లు నమోదు కాగా తాజా డిమాండ్ ఆ రికార్డును అధిగమించింది. గత ఏడాది…
Bhatti Vikramarka : రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న…
Telangana Power Demand : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఒక వైపు, పట్టణాల్లో కూలర్లు, ఇతర విద్యుత్ అవసరాలు మరో వైపు కలిసిపోవడంతో జనవరి నెలలోనే విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ దాదాపు 14,850 మెగావాట్లు దాటగా, దక్షిణ డిస్కం పరిధిలో 9,500 మెగావాట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా 14,785 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ యాసంగి సీజన్‌లో…
CM Revanth Reddy : పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని…
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.
విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్…