రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ర్పచారం చేశారని, పదే పదే ప్రభుత్వం మీద బురద చల్లే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పులు శుభ్రం చేయటానికే తమకు టైం సరిపోతుందని, విద్యుత్ శాఖను ఆయన దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో…
Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్…
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు..దీంతో రావలసిన నిధుల విషయం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది.. విభజన హామీలు అమలు చేయకపోయినా కానీ ఎప్పటికప్పుడు నిధులిస్తూ వస్తుంది కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్…
Karnataka: దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారు. కాంగ్రెస్ గత మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా విజయం సాధించింది. ప్రజలంతా ఈ హడావుడిలో ఉండగా.. కర్ణాటకలో మాత్రం విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ప్రతీ యూనిట్ కు 70 పైసల చొప్పున పెంచింది. ఈ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. దశాబ్ధకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఛార్జీలు పెరిగాయి. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్‌సి) మే 12న 70 పైసల సుంకం…
తెలంగాణలో మరోసారి విద్యుత్ చార్జీల మోత మోగనుందా? అంటే ఏమో అది జరిగినా ఆశ్చర్యం మాత్రం లేదు.. ఎందుకంటే.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావుకు సమర్పించాయి డిస్కంలు.. ఇక, తనకు అందిన ప్రతిపాదలనపై తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి అందించాయి.. ఈ వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో పెడతాం అన్నారు.. డిస్కమ్స్ ప్రతిపాదనలపై బహిరంగ ద్వారా…
ఏపీ సీఎంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు…
రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు. జగన్ కి నిజంగా దమ్ముంటే…
విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు. ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి.…